హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu). ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి, ఎ ఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘అసుర హననం’ అనే పాట లిరికల్ వీడియోని విడుదల చేశారు.
ఈ పాటని రాంబాబు గోశాల రచించగా.. ఐరా ఉడుపి, కాలభైరవ, సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదెర, హైమత్ మహ్మద్ పాడారు. కీరవాణి అందించిన సంగీతం ఈ పాటను మరింత పవర్‌ఫుల్‌గా మార్చింది. ఈ పాట ఫ్యాన్స్‌కి విశేషంగా ఆకట్టుకుంటుంది. ‘ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వడం పక్కా’ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా జూన్ 12వ తేదీన విడుదల కానుంది.