Thursday, May 22, 2025

గురువారం రాశి ఫలాలు (22-05-2025)

- Advertisement -
- Advertisement -

మేషం: అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. ఆస్తి  వివాదాలు తీరి నూతన ఒప్పందాలకు కుదురుతాయి . విహార యాత్రలు చేస్తారు.

వృషభం: వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు.   ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కర్కాటకం: సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలలో పురోగతి.ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి

సింహం: పారిశ్రామిక రంగాలలోని వారికి బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది.

కన్య: సంతానం నుండి ధన లాభం పొందుతారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. రుణ బాధల నుండి విముక్తులవుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, సంఘంలో గౌరవం పొందుతారు.

తుల: ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.

వృశ్చికం: మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు.ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఇతరుల విషయాలలో జోక్యం తగదు.నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు.బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు ఎదురయి చికాకులు పెడతాయి. ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.

మకరం: భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

కుంభం: సంఘంలో గౌరవం పొందుతారు. పనులు నిదానంగా సాగుతాయి నూతన ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. విహార యాత్రలు చేస్తారు.

మీనం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాజకీయ రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.

Guruvaram rasi phalalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News