Monday, July 7, 2025

సింధ్‌ ప్రావిన్స్‌లో హోంమంత్రి ఇంటిని తగలబెట్టారు.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాకిస్థాన్ లోని సింధ్‌ ప్రావిన్స్‌లో హింస చెలరేగింది. సింధ్‌ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిపై ఆందోళనకారులు దాడులు చేసి తగలబెట్టారు. నీటి వివాదంలో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. దాడులను అడ్డుకునేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. పోలీసులపైనా ఆందోళనకారులు దాడికి దిగారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. పోలీసులుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు బాష్ఫవాయువు ప్రయోగిస్తున్నారు. హోంమంత్రి లాంజర్ నివాసంపై జరిగిన దాడిని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ తీవ్రంగా ఖండించారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ దాడి ఉగ్రవాదంతో సమానమని, నిరసనల వెనుక దాక్కున్న వారి దురుద్దేశాలు ఇప్పుడు బయటపడ్డాయన్నారు. 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News