Friday, May 23, 2025

మహిళ మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి.. రైలు నుంచి విసిరేసి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను హత్య(Woman Body) చేసి.. సూట్‌కేసులో పెట్టి రైల్వేబ్రడ్జి వద్ద వదిలేశారు. చందాపూర రైల్వేబ్రడ్జ్ సమీపంలో స్థానికులు ఓ సూట్‌కేసును గుర్తించి.. దాన్ని తెరిచి చూశారు. అందులో మహిళ మృతదేహం (Woman Body) ఉండటంతో వాళ్లు కంగారు పడ్డారు. వెంటనే పోలీసులు సమాచారం అందించడంతో.. పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. వేరే ప్రాంతంలో హత్య చేసి రైలులో నుంచి ఇక్కడ విసిరేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ మహిళ ఎవరూ, ఏ ప్రాంతానికి చెందినది అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News