Thursday, May 22, 2025

ఇంటి కప్పు కూలి తండ్రి కూతురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో వర్షం , భారీ స్థాయి గాలులు తీవ్ర నష్టం కల్గించాయి ఇక్కడి ఇంటి కప్పు కూలిన ఘటనలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. ముగ్గురు గాయపడ్డారని స్థానిక అధికారులు బుధవారం తెలిపారు. పాటియా ఫార్మ్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది. ఇంట్లోని 45 సంవత్సరాల జస్పాల్ సింగ్ , పది సంవత్సరాల కూతురు రమణ్‌దీప్ కౌర్ గోడకూలిన దశలో శిథిలాల కింద నలిగి చనిపోయినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. భారీ వర్షం ఈ కుటుంబానికి పెను విషాదం కల్గించింది. భారీ వర్షాలతో ఇక్కడ మహా వృక్షాలు నేలకొరిగి పడటం, ఇళ్ల కప్పులు ఎగిరిపోవడం , పాత ఇండ్ల గోడలు కూలిపడటం జరిగింది. పలు ప్రాంతాలో జనం భయభ్రాంతులు అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News