Thursday, May 22, 2025

సూట్‌కేసులో యువతి శవం.. బెంగళూరు శివార్లలో కలకలం

- Advertisement -
- Advertisement -

కర్నాటక రాజధాని బెంగళూరు శివార్లలో రైలు పట్టాల పక్కన ఓ సూట్‌కేసులో ఓ మహిళ మృతదేహం కుక్కి ఉన్న దశలో పడి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వారు ఎవరో ఈ యువతి శవంతో కూడిన సూట్‌కేసును రైలు నుంచి పట్టాల వైపు పడేసి ఉంటారని భావిస్తున్నారు. చంద్రాపూర్ వద్ద దొరికిన ఈ శవం సూట్‌కేసుస్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ యువతి వయస్సు 18 అంతకు మించి ఉంటుందని వెల్లడైంది. వొంటిపై ఎటువంటి గాయాలు లేవు.

సూట్‌కేసు నుంచి లభ్యమైన వస్తువులు, వస్త్రాల ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసు బృందాలు యత్నిస్తున్నాయి. యువతిని ఎక్కడనో చంపేసి, సూట్‌కేసులో పెట్టి పారేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వేగంగా కదులుతున్న రైలులో నుంచే సూట్‌కేసు పారేసి ఉంటారని వెల్లడైంది. దర్యాప్తు చేపటినట్లు బెంగళూరు రూరల్ ఎస్‌పి సికె బాబా తెలిపారు. సూట్‌కేసులో యువతికి సంబంధించిన గుర్తింపు కార్డులు కానీ , ఇతరత్రా ఆమె వస్తువులు కానీ లేవని , ఆచూకీ కోసం అన్ని రకాలుగా విచారణ చేపట్టామని ఎస్‌పి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News