భారత మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు చత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్, ఇంద్రావతి తీరం అ డవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపో యా రు. ఈనేపథ్యంలో ఆయన గురించి తెలిసిన సమాచారం. ఆయన శ్రీకాకుళం జిల్లాలో జా తీయ రహదారి పక్కన ఉన్న జియ్యన్న పేట అనే ఓ సామాన్య కాళింగ కుటుంబంలో జ న్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యా యుడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ము గ్గురు కూతుళ్లు. పిల్లల్ని చదివించడానికి ప్రా ధాన్యం ఇచ్చారు. కేశవరావు వరంగల్‌లో ఇంజనీరింగ్ చదివారు. మరో కుమారుడు డిల్లేశ్వరరావు. బాగానే చదువుకొని , అం డమాన్, మంగుళూరు, విశాఖ పోర్టు ల్లో ఉ ద్యోగం చేశారు. ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేశవరావు వరంగల్ లో బీటెక్ చదువుతున్న ప్పుడే కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్య మూర్తి ప్రభావానికి లోనయ్యారు.
అక్కడ కళ్ల ద్దాల శ్రీనివాస్ అనే పేరుతో అందరికీ తెలిసి న డాక్టర్ శ్రీనివాసరావు, ఆయన భార్య డాక్ట ర్ నళిని రాడికల్ విద్యార్థుల ఉద్యమానికి ప్రేరణ నిలిచేవారు. పీపుల్స్ వార్ పార్టీ ఏర్ప డినప్పుడు శ్రీనివాసరావు కు విశాఖపట్నం ప్రాంత బాధ్యతలను పార్టీ అప్పగించింది. బిటెక్ చదువుతున్నప్పుడు, ఆర్‌ఎస్‌ఎస్ విద్యా ర్థి సంఘంతో గొడవ జరిగినప్పుడు, కేశవ రావు అరెస్ట్ అయ్యారు. ఆనాటి ఫోటో మాత్ర మే ఈనాటికి ప్రభుత్వ వర్గాల దగ్గర ఉంది. ఎంటెక్ చదువుతూ, 1984లో ఆయన గెరి ల్లా దళాల్లో చేరారు. ఆనాటికి విశాఖపట్నం ఏజెన్సీలో మూడు దళాలు ఏర్పడ్డాయి. గంటి రమేష్ నాయకత్వంలో ఒక దళం ఉండేది. ఆ యన బొబ్బిలికి చెందిన బ్రాహ్మణ కుటుం బీకుడు. ఆయన కూడా ఇంజనీరింగ్ విద్యా ర్థి. తొలి రోజుల్లో ఇతని దళంలో కేశవరావు పని చేశారు. సహజమైన ఉద్వేగం, ఇంజనీ రింగ్ పరిజ్ఞానంతో, పేలుడు పదార్థాల త యారీలో కేశవరావు ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు.’
ఆ ప్రతిభతోనే అతన్ని మందు పాతరల నిపుణుడిగా, పార్టీ నాయకత్వం ప్రోత్సహించింది. ఎక్కడ, ఎలా వాటిని ఉపయోగించాలో, నిర్ణయించేవాడు. క్రమంగా, సైనిక యుద్ధ వ్యూహకర్తగా ఎదిగాడు. సెంట్రల్ మిలటరీ కమిషన్ అనేది ఆయన ప్రతిపాదన మేరకే ఏర్పాటు అయినట్టు ఒక ప్రచారం ఉంది. ఆయన దానికి చైర్మన్ కూడా. శ్రీలంకలో’ ఈలం’ సాయుధ పోరాట యోధులతో పీపుల్స్ వార్ ఏర్పాటుచేసిన సైనిక శిక్షణ శిబిరంలో కేశవరావు ఎన్నో మెళకువలను నేర్చుకున్నారు. పార్టీ పదవుల పట్ల ఆసక్తి లేకుండా, వివాహం వంటి వ్యక్తిగత అనురక్తులు లేకుండా, దళాలకు దిశా నిర్దేశం చేయడానికి జీవితాన్ని కేటాయించారు. కొండలను, అడవులను అధ్యయనం చేస్తూ, పాతదారులను వినియోగించకుండా, కొత్త దారులను సూచించేవారు. ముప్పాళ్ళ లక్ష్మణరావు ( గణపతి) రాజీనామా తర్వాత మాత్రమే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సైనిక వ్యూహాలు ఆయనకు ఇష్టం. గొరిల్లా యుద్ధం పట్ల ఆయనకు శ్రద్ధ. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మావోయిస్టుల ఏరివేతకు ప్రాధాన్యం ఇచ్చి, ఎన్నో భారీ ఎన్ కౌంటర్లు చేసినప్పుడు, కేశవరావు చనిపోయాడు అనే ప్రచారం జరిగింది.
2014 అక్టోబర్లో అబూజ్ గడ్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, దాదాపు నిజమే అనుకున్నారు. సాధారణంగా, మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులకు మూడంచెల భద్రత ఉంటుంది. పి ఎల్ జీవో సెక్యూరిటీ, సి ఆరు సెక్యూరిటీ, రెగ్యులర్ దళాల సెక్యూరిటీ ఉంటాయి. వీటిని దాటుకొని, కేశవరావుని ఎన్‌కౌంటర్ చేశారంటే, కొంతమంది నమ్మటం లేదు. వేలాది మందితో, ఆపరేషన్ కగార్ పేరుతో వేట మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నంలో, కేశవరావు దాదాపు 70 ఏళ్ల వయసులో చనిపోయి ఉండి ఉండొచ్చు. చివరగా, ఆయన ఒకసారి.. అదే చివరిసారి.. శ్రీకాకుళం జిల్లాలోని సొంత ఊరికి వచ్చి తండ్రిని, నా వాటా ఆస్తి ఇస్తే, పేదలకు పంచి ఇస్తాను అన్నాడట. పిల్లలకు చదివించడానికే, డబ్బులు ఖర్చయిపోయాయి.. పంచడానికి ఏమీ లేదు.. అని తండ్రి అన్నాడట. ఆ మాట తర్వాత మళ్లీ తల్లితండ్రులను కూడా చూడటానికి ఆయన రాలేదు. ఆయన ఎవరిని చూడటానికి, జీవితాన్ని కేటాయించుకున్నాడో.. వారికే తన అంతిమ రక్తపు చుక్కలను కేటాయించుకున్నాడు.