రూ.10లక్షల లోపు బిల్లులు క్లియర్
ఒకేరోజు 9,990 బిల్లులకు
చెల్లింపులు రూ.153కోట్లు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద
రూ.85 కోట్లు విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న 9,990 బిల్లులను ప్ర భు త్వం ఒకే రోజున క్లియర్ చేసింది. ఇందుకు గాను రూ.153 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ బుధవారం వివరాలను వెల్లడించింది. గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లించాలని గత కొంత కాలంగా మాజీ సర్పంచ్‌లు, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సర్పంచ్‌ల సంఘాలు ఆందోళనలు, రాస్తారోకోలు కూడా నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో ప్రభుత్వం పది లక్షల లోపు ఉన్న బిల్లులను చెల్లించేందుకు అంగీకరించింది. ఈ నేపధ్యంలో 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు నిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా ఒకే విడతలో రూ. 10 లక్షల లోపు బిల్లుల చెల్లింపునకు లైన్ క్లియర్ చేసింది.