Thursday, May 22, 2025

ఐకాన్‌స్టార్ సినిమా కోసం హైదరాబాద్‌కు అట్లీ

- Advertisement -
- Advertisement -

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబో కోసం భారతదేశ సినీ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)ఫస్ట్ తెలుగు సినిమా ఇది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఇది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్, హాలీవుడ్ టెక్నిషియన్స్, దర్శకుడు అట్లీలపై చిత్రీకరించిన ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ అనౌన్స్‌మెంట్‌ను చేసి అందరిని సంభ్రమశ్చర్యాలకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వీంగ్‌లో ఉంది.

కాగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఐకాన్‌స్టార్‌ను కలిసి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ సంబంధించిన చర్చల్లో పాల్గొనబోతున్నారు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఎ22 x ఎ6గా పిలవబడుతున్న ఈ చిత్రం, భారతీయ విలువలతో కూడిన కథనంతో కూడిన ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కలిగించేలా రూపొందించనున్న ఈ సినిమా, భావోద్వేగాలు, మాస్ యాక్షన్, పెద్ద స్కేలు నిర్మాణంతో ఓ చారిత్రక సినిమాగా నిలవనుందని చెప్పబడుతోంది. ఈ ప్రత్యేక వీడియో చూసిన అందరూ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ మ్యాజిక్ జరగబోతుందని, ఈ చిత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్, హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఉండబోతుందని అర్థమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News