Thursday, May 22, 2025

ప్రతీ రోజు కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు వేయాలి: పొన్నం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైల్వే శాఖ మంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఈ స్టేషన్ ను మార్పు చేయడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో 103 స్టేషన్ లలో తెలంగాణ నుండి కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్ లను పునరాభివృద్ధి చేసి ప్రారంభం చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికుల సౌకర్యం కోసం అధునాతన సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసుకొని ప్రారంభం చేసుకున్నామని, 1267, 1268 కరీంనగర్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కరీంనగర్ వెళ్ళే రైలు వారానికి రెండు రోజులు నడుస్తుంది దానిని ప్రతిరోజూ లేదా వారానికి నాలుగు రోజులు నడిచేలా చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను పొన్నం కోరారు.

తిరుపతి రైలుకు ప్రయాణికుల రద్దీ బాగుండడంతో నిత్యం వెళ్లేలా చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ లో పార్టిలైజర్ లోడింగ్, అన్ లోడింగ్ హమాలీ సమస్యలను తొలగించామన్నారు.  కరీంనగర్ నుంచి ముంబయి, షిర్డీలకు రైలు ప్రారంభిస్తే అందరికీ ఉపయోగపడుతుందని వివరించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య పాల్గొన్నారు. కరీంనగర్ నుండి తిరుపతి వెళ్ళే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రతిరోజు నడిచేలా మార్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపత్రం సమర్పించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News