మేషం – సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.
వృషభం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకు పెడతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.
మిథునం – జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
కర్కాటకం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది.
సింహం – ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కన్య – ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. రాజకీయాల రంగాలలోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు.
తుల – ప్రయాణాలు లాభిస్తాయి.కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరుల నుండి వచ్చిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. అనుకోని నూతన అవకాశాలు లభిస్తాయి.
వృశ్చికం – దీర్ఘకాలిక రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆస్తి వ్యవహారాలలో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు. విహార యాత్రలు చేస్తారు.
ధనుస్సు – సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. అప్రయత్న కార్యసిద్ధి. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఒక అవకాశం మీ దగ్గరకు వచ్చి ఆశ్చర్యపోతారు. రుణ బాధలు తొలగుతాయి.
మకరం – వివాహ ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటి కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అభివృద్ధి సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు.
కుంభం – రుణ బాధల నుండి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు.ఇతరుల విషయాలలో జోక్యం మంచిది కాదు. అనుకోని అవకాశాలు మీకు చేతికి అందుతాయి.
మీనం – రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు.కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు. క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేస్తారు.