Thursday, May 22, 2025

23 నిమిషాల్లోనే ముక్కులు ముక్కలు చేశాం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్‌ సిందూర్‌ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను అంతం చేశామని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని.. త్రివిధ దళాలు చక్రవ్యూహాలతో శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పారు. పహల్గామ్‌ ఘటనకు జవాబుగా 23 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆయన తెలిపారు. భారత్‌లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు ముక్కలు చేశామని ప్రధాని మోడీ అన్నారు.

కాగా, ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు.. పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 26మంది చంపిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్ విరుచుకుపడింది. ఉగ్రవాదుల ప్రధాన స్థావరాలపై దాడులు చేయడంతో దాదాపు 100 మంది హతమయ్యారు. అంతేకాదు, భారత్ దాడుల్లో కీలక ఉగ్రవాదులు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News