Friday, May 23, 2025

భారీ వర్షాలు.. 24 గంటల్లోనే 34 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రంలో నిన్నటి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మెరుపులు, ఉరుములు, బలమైన ఈదురు గాలులతో కూడిన తుఫాను వర్షాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. బలమైన ఈదురు గాలులకు చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో భవనాలు, చెట్లు కూలిపోవడం, పిడుగుపాటు కారణంగా ఎక్కువ మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని.. వేగంగా సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధిత జిల్లాల అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని, సర్వేలు నిర్వహించాలని, సహాయక చర్యలను నిశితంగా పర్యవేక్షించాలని సిఎం యోగీ సూచించారు. వర్షాల కారణంగా ప్రాణనష్టం జరిగితే బాధిత కుటుంబాలకు వెంటనే సహాయ నిధుల పంపిణీని నిర్ధారించాలని.. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News