హైదరాబాద్: ఎస్ఎల్ బిసిలో చిక్కుకున్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బయటకు తీసుకురాలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని, పాలమూరులాగే కాళేశ్వరంలోనూ నిజం తెలుస్తుందని చెప్పారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే.. ఏదో అయినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి అపరిచితుడులా ఉన్నారని, అప్పు పుట్టలేదు అని రెమో అంటారని.. లక్షా 60 వేల కోట్లు అప్పు రాము చేశారని అన్నారు. ఉన్న డిక్లరేషన్ కే దిక్కు లేదని.. ఇప్పుడు నల్లమల డిక్లరేషన్ ఎందుకు? అని ప్రశ్నించారు. నెల రోజులుగా సిఎం మదిలో ఉన్నది వరల్డ్ బ్యూటీస్, కెసిఆర్ కు నోటీసులని చెప్పారు. బ్యూటీ కాంటెస్ట్ వల్ల ఏం లాభం? అని.. తాము కట్టిన వాటి ముందు ముద్దుగుమ్మలు ఫోటోలు దిగుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు.
ఉన్న డిక్లరేషన్ కే దిక్కు లేదు..ఇప్పుడు నల్లమల డిక్లరేషన్ ఎందుకు?: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -