Friday, May 23, 2025

సరస్వతి పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తుండగా కాటారం టోల్‌గేట్‌ వద్ద జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొన్నాయి. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని చిట్యాల మండలంలోని నైన్‌పాక వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News