‘పుష్ప 2’ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ ను రఫ్ఫాడించింది. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘పుష్ప 2’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం హిందీలోనే 800 కోట్ల రూపాయలకు పైగా ఈ మూవీ వసూల్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి బన్నీ షాకిచ్చాడు. దంతో ఈ చిత్రం తర్వాత అల్లుఅర్జున్ చేయబోయే తర్వాత మూవీపై ఇప్పడు అందరి కళ్లు పడ్డాయి. ఈ క్రమంలో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్టును ప్రకటించాడు. స్పై థ్రిల్లర్ గా హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడు అట్లీ. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో దీపికా పడుకొనె, జాన్వీ కపూర్, మృనాల్ ఠాకూర్ లు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ముగ్గురు భామలు సైన్ చేశారని సమాచారం. దీంతో బన్నీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక, ఈ మూవీలో బన్నీ.. మాఫియా గ్యాంగ్‌స్టర్, వారియర్, సిజిఐ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.