సిద్ధిపేట: మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెఆర్‌తో హరీష్ రావు భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వరుసగా రెండో రోజు హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కెసిఆర్ తో సమావేశమయ్యారు. గురువారం కెసిఆర్ తో హరీశ్ రావు మూడున్నర గంటల పాటు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నోటీసులు వచ్చాక విషయంపై ఆలోచిద్దామని హరీశ్ కు కెసిఆర్ చెప్పినట్లు సమాచారం.
కాగా, కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో కెసిఆర్, హరీశ్ రావు, బిజెపి ఎంపి ఈటల రాజెందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కెసిఆర్ సిఎంగా ఉన్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు(Harish Rao), ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. దీంతో జూన్ 5న కెసిఆర్, 6న హరీశ్‌రావు, 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరుకావాల్సిందిగా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.