Friday, May 23, 2025

కోవిడ్ నుంచి కోలుకున్నా: శిల్పా శిరోద్కర్

- Advertisement -
- Advertisement -

కోవిడ్19 నుంచి కోలుకున్నానని, ఇప్పుడు బాగున్నానని నటి శిల్పా శిరోద్కర్ గురువారం తెలిపింది. 51ఏళ్లున్న ఆమె ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘చివరికి కోలుకున్నా, ఇప్పుడు బాగున్నా, మీరు కనబరిచిన ప్రేమకు థ్యాంక్స్, గురువారం ఆనందంగా ఉంది’ అంటూ బాంద్రావోర్లీ సీ లింక్‌లో కారు నుంచి ఓ ఫోటో కూడా పెట్టింది. 1990 దశకంలో ఆమె నటించిన ‘బేవఫా సనం’, ఖుదా గవాహ్’, గోపీ కిషన్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘బిగ్ బాస్ 18’ కూడా పాల్గొంది. మాస్క్‌లు ధరించమని, సురక్షితంగా ఉండమని ఆమె తన ఫాలోయర్లని కోరింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా ఇద్దరు మరణించారని మహారాష్ట్ర వెల్లడించింది. కాగా కోవిడ్ భయాందోళనలు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News