Friday, May 23, 2025

రాజీవ్ యువ వికాసానికి నోడల్ అధికారి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉద్యోగ అవకాశాలు రానటువంటి నిరుద్యోగ యు వతకు స్వయం ఉపాధి కల్పించడానికి రా ష్ట్రంలో ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం శాంక్షన్ లెటర్స్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం జూన్ 2న అందించాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల స మితి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాబుద్దులు నేర్చిన మానవ వనరులు ఖాళీగా ఉండటం వల్ల లాభం కంటే, సమాజానికి నష్టమే ఎక్కువగా ఉం టుందని, ఆ నష్టం జరగకుండా ఉండాలని వారి మేధస్సును ఉత్పత్తి రంగంలో వినియోగించి జిడిపికి పెద్ద ఎత్తున ఉపయోగం ఉండేలా రాజీవ్ యువ వికాస పథకం తీసుకువచ్చామని వివరించారు. ఐదు ల క్షల మంది యువతకు 9 వేల కోట్ల రూపాయలు సాయం చేసే పథకం దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా తీసుకురాలేదన్నారు. పె ద్ద ఎత్తున తీసుకువస్తున్న ఈ పథకాన్ని మంచి మనసుతో బ్యాంకర్లు ముందుకు తీ సుకువెళ్లాలని కోరారు. రాజీవ్ యువ వి కాస పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 6,250 కోట్ల రూపాయలు సబ్సిడీ రూ పేణా ఇస్తున్నదని తెలిపారు.

‘గతంలో యువతకు స్వ యం ఉపాధి కింద రుణాలు ఇచ్చే సమయంలో 70 శాతం రుణం, 30 శాతం స బ్సిడీ ఉండేదని, ఇప్పుడు ఇది రివర్స్‌గా ఉందన్న విషయాన్ని బ్యాంకర్లు గ్రహించాలన్నారు.8 లక్షల కోట్ల రూపాయల పైబడి లక్ష్యంగా పెట్టుకున్న వార్షిక రుణ ప్రణాళికలో రాజీవ్ యువ వికాస పథకం కోసం బ్యాంకర్లు 0.2 శాతం మాత్రమే వెచ్చించా ల్సి ఉంటుందన్నారు. చదువుకునే ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి ప్ర జా ప్రభుత్వం బాగా చదివిస్తోందని తెలిపా రు. తద్వారా విద్యలో నైపుణ్యం కలిగిన యువత ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. ఉద్యోగ అవకాశాలు రాని వారి మేధస్సును కూడా ఈ సమాజానికి వాడాలని వారి మేధస్సు ను వ్యాపారంలో కానీ చేసుకుంటూ రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళుతున్నదని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్య పైన పెద్ద ఎత్తున దృష్టి సారించి స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ప్రొఫెషనల్ కాలేజీల్లో చదివే ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తూ విద్యావంతులైన మానవ వనరులను పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం వైపు దేశం మొత్తం చూస్తున్నదన్నారు. అభివృద్ధికి కావలసిన ఇంఫ్రాస్ట్రక్చర్ను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని చెప్పారు.

వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత : ప్రజా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ఇందులోనూ ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రానికి కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆయిల్ ఫామ్ పంటలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులో ఉదారంగా వ్యవహరించాలని కోరారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రుణాలు ఉన్న రైతులందరికీ ఏకకాలంలో 21 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో జమ చేశామని గుర్తు చేశారు. పెట్టుబడి సహాయంగా రైతులకు రైతు భరోసా అందిస్తున్నామని రైతు బీమా ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నదని తెలిపారు.

రూ.12,600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం : అడవిలో అనాదిగా ఇబ్బందులు పడుతున్న అడవి బిడ్డల జీవన ప్రమాణాలు పెంచడానికి లక్ష్యంగా పెట్టుకొని ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పొంది ఉన్న ఆరు లక్షల 70 వేల ఎకరాలను సౌర విద్యుత్తు ద్వారా సాగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం 12,600 కోట్ల రూపాయలను కేటాయించామని వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఏడాది వడ్డీ లేకుండా 20 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చామని, రానున్న నాలుగు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాకుండా రకరకాల వ్యాపారాలు చేసుకోవడానికి కావలసిన మార్గాలను కూడా ప్రభుత్వమే వారికి చూపిస్తున్నదని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్టీసీలో అద్దె బస్సులు పెట్టుకోవడానికి సహకారం అందిస్తున్నామని, సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు.

గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు : రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చి 2030 సంవత్సరం నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో మూసి పునర్జీవం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నదని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్డు మధ్యన అనేక రకాలైన క్లస్టర్ తో పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. 2025- 26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

సామాజిక బాధ్యతను నెరవేర్చే క్రమంలో బ్యాంకర్లు ముందంజలో ఉండాలని సూచించారు. ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగం రెండు కలిసి సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి ముందుకు వెళితే సమాజంలో అశాంతి లేకుండా ఉంటుందన్నారు. సమాజం శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి ముందుకు వెళ్తుందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్ శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ శ్రీధర్, ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, నాబార్డ్ సీజిఎం ఉదయ్ భాస్కర్, ఎస్‌బిఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ కుమార్, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ ప్రకాష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News