Friday, May 23, 2025

రాష్ట్ర ప్రజలకు దసరా కానుక

- Advertisement -
- Advertisement -

విజయదశమినాడు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం రాబోయే నాలుగేళ్లలో
రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమాలు యాదగిరిగుట్టకు ఎంఎంటిఎస్
బేగంపేట అమృత్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి
కిషన్‌రెడ్డి వెల్లడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తుంది : కోమటిరెడ్డి
రాష్ట్రంలోని అమృత్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

(మొదటిపేజీ తరువాయి)మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో రై ల్వేల అభివృద్ధి వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి, కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ ప్ర భుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాబోయే నా లుగేళ్లలో విప్లవాత్మక కార్యక్రమాలు రాష్ట్రంలో చేసి చూపుతామని కిషన్ రెడ్డి చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో ఫేస్‌లో యాదగిరిగుట్ట వరకు చేపడ్తామని త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రా రంభిస్తామని చెప్పారు. దసరా రోజు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు ప్రధాని మోడీ స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తే ఆ కార్యక్రమానికి మాజీ సిఎం రాకపోగా ఆయన కుమారుడు నన్ను విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలో ఈ సంవత్సరం రూ. 5,337 కోట్లు రైల్వేల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.80 వేల కోట్ల పనులకు సంబంధించి ప్లానింగ్ జరుగుతోందని కిషన్ రెడ్డి చెప్పారు. అనేక రైల్వే స్టేషన్లలో పనులకు భూసేకరణ సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా భూసేకరణ చేసి ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. దేశంలోనే ప్రయోగాత్మకంగా తెలంగాణలో కవచ్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టామని దీని ద్వారా ప్రమాదాలు నివారించవ్చన్నారు. 617 కి.మీ. కవచ్ టెక్నాలజీ పరిధిలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 101 అన్‌మ్యాన్ లెవల్ క్రాసింగ్‌లు, 235 మ్యాన్ లెవల్ క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించామని203 రోడ్ అండ్ బ్రిడ్జీలను, 43 రోడ్ ఓవర్ బ్రిడ్జీలను, 45 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను నిర్మించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో 1300 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని అందులో తెలంగాణ నుంచి 40 స్టేషన్‌లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. పనులు పూర్తి చేసుకున్న మూడు స్టేషన్లు ఇప్పటు ప్రారంభించుకోగా 2026 లో మిగితా మొత్తం రైల్వే స్టేషన్లు అభివృద్ధి పూర్తి చేసుకొని ప్రారంభించుకుంటామన్నారు. అందులో సికిందరాబాద్, హైదరాబాద్ స్టేషన్‌లు కూడా ఉన్నాయన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ లో అన్ని విభాగాల్లో మహిళా సిబ్బందే ప్రజలకు సేవలు అందించబోతున్నట్లు చెప్పారు.’

అంతర్జాత విమానాశ్రయాన్ని తలపిస్తోంది : కోమటి రెడ్డి
చిన్నప్పటి నుండి చూస్తున్న బేగంపేట్ రైల్వే స్టేషన్ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని రైల్వే స్టేషన్‌ల అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఘట్కేసర్ నుండి యాదాద్రివరకు భక్తుల కోసం ఎంఎంటిఎస్ మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు అతిథులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శాలువాలు, మొక్కలతో సత్కరించారు. బేగంపేట్ స్టేషన్ నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులతో గ్రూప్‌ఫొటో దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News