Friday, May 23, 2025

గీత దాటుతున్న ఇడి

- Advertisement -
- Advertisement -

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా
వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ
తమిళనాడు మద్యం రిటైలర్
టాస్మాక్‌పై దాడులను
తప్పుపట్టిన సుప్రీం కోర్టు
ఇడి దర్యాప్తుపై స్టే విధించిన
అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ : తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం రిటైలర్ టాస్మాక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల సోదాలు జరిపారు. దీనిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అన్ని హద్దులు దాటుతోందని ఆక్షేపించింది. సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందన్న ధర్మాసనం , టాస్మాక్‌పై జరుగుతు న్న మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధించింది. టాస్మాక్‌లో రూ.1000 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఈడీ ఈ ఏడాది మార్చి లో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో సోదాలు జ రిపింది. మే నెల ఆరంభంలో టాస్మాక్ అధికారుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేసింది. ఈ అవకతవకలకు సంబంధించి రాష్ట్ర పోలీసులు , అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగాఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిం ది. దీనిపై తమిళనాడు సర్కారు హైకోర్టుకు వెళ్లిం ది.

ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ సోదాలు జ రుపుతోందని , విచారణ పేరిట టాస్మా క్ అ ధికారులను హింసిస్తోందని ఆరోపించిం ది. ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ , ఈడీ దర్యాప్తునకు అంగీకరించింది.న దీం తో తమిళనాడు ప్రభుత్వం , టాస్మాక్ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యా యస్థానం ఈడీ తీరును తప్పు పట్టింది. సోదాల పేరుతో హ ద్దులు దాటుతున్నారని ఆ గ్రహించింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇ వ్వాలం టూ దర్యాప్తు సం స్థకు నోటీసులు జారీ చేసింది. సు ప్రీం ఉత్తర్వులపై డీఎం కే హర్షం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలకు ఇది చెంపపెట్టు లాంటిదని దుయ్యబట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News