అమరావతి: టిడిపి మహానాడులో ఆ పార్టీ ఎంఎల్ఎ బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి. టిడిపి పార్టీ మీదనే ఆ పార్టీ ఎంఎల్ఎలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము ఏమి పాపం చేశామని రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని వాపోతున్నారు. తనని ప్రజలు ఓట్లు వేసి 28000 మెజారిటీతో గెలిపించారని సత్యనారాయణ తెలిపారు. అన్ని నియోజకవర్గాలకు సమానంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని నియోజకవర్గాలకు 7 కోట్లు ఇచ్చారని, తన నియోజకవర్గానికి మాత్రం 3 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి అవసరం లేదని టిడిపి మహానాడులో చెప్పాలని చురకలంటించారు. ప్రజలకు వెళ్ళి క్షమించమని అడుగుతామని సత్యనారాయణ పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయవద్దని కోరారు. తన నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ మూసివేస్తున్నారని, దానిని ఆధునీకరణ చేయాలని డిమాండ్ చేశారు. మూడు నియోజవర్గాల రైతులకు షుగర్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉందన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎంఎల్ఎ
- Advertisement -
- Advertisement -
- Advertisement -