షార్జా: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE won T20 series ) (యుఎఇ) సొంతం చేసుకుంది. మూ డో, చివరి టి20లో యుఎఇ ఏడు వికెట్ల తేడాతో సంచలన విజ యం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 21తో దక్కించుకుం ది. బంగ్లాదేశ్‌పై యుఎఇకి ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికె ట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
ఓపెనర్ తంజీద్ హసన్ (40), జాకేర్ అలీ (41), హసన్ మహమూద్ 26 (నాటౌట్), ష రిఫుల్ ఇస్లామ్ 16(నాటౌట్) జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యుఎఇ 19.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ మ హ్మద్ జోహెబ్ (29), అలీషాన్ షర్ఫు 68 (నాటౌట్) మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఆసిఫ్ అలీ ఖాన్ 26 బంతుల్లోనే ఐదు సిక్సర్లతో అజేయంగా 41 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.