Saturday, May 24, 2025

గుంతకల్లు రైల్వేస్టేషన్ లో ఊడిన పెచ్చులు… బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో పెచ్చులూడి బాలుడిపై పడడంతో మృతి చెందాడు. బాలుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లేందుకు ఏడో నంబర్ ప్లాట్ ఫామ్ వద్ద రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో పైకప్పు పెచ్చులూడి బాలుడిపై పడ్డాయి. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే దుర్మరణం చెందాడని వైద్యులు పేర్కొన్నారు. అమృత్ భారత్ లో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న రైల్లే స్టేషన్లను అధునీకరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే శాఖ నిర్లక్ష్యంలో పసివాడి ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దైవదర్శనానికి వెళ్దామనుకుంటే తమ కుమారుడిని దేవుడే తీసుకెళ్లాడని కన్నీంటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా శిథిలావస్థకు చేరుకున్న రైల్వే స్టేషన్లను బాగు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News