హైదరాబాద్: నటుడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఫ్యాన్స్‌కి శుభవార్త చెప్పారు. హనుమాన్ జయంతి రోజున ఆయన తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెబుతూ తనకు అబ్బాయి పుట్టిన విషయాన్ని తెలిపారు కిరణ్. తన భార్య రహస్యకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. బాబు పాదాలను ముద్దాతున్న ఫోటోని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
2019లో విడుదలైన ‘రాజవారు రాణిగారు’ అనే సినిమాలో కిరణ్ (Kiran Abbavaram), రహస్య కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2024లో కిరణ్, రహస్యలు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక కిరణ్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం కిరణ్.. ‘కె-ర్యాంప్’ అనే సినిమాలో నటిస్తున్నారు.