Friday, July 11, 2025

శనివారం రాశి ఫలాలు (24-05-2025)

- Advertisement -
- Advertisement -

మేషం: సంతానం యొక్క యోగక్షేమాల పట్ల అధిక శ్రద్ధను చూపుతారు. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి.

వృషభం: ఆర్థిక ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు.

మిథునం: ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు.

కర్కాటకం: కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు, వినోదాలు, ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వివాదాలకు దూరంగా ఉండండి.

సింహం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి.

కన్య: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. మొండి బాకీలు వసూలు అవుతాయి.

తుల:  సంతానంనకు నూతన విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి బయటపడతారు. విహారయాత్రలు చేస్తారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి.

వృశ్చికం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు – మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. విందు వినోదాలు.

మకరం: బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. ధన, వస్తులాభం.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం. నూతన వస్తు సేకరణ.

మీనం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకొంటారు.

Guruvaram rasi phalalu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News