Saturday, May 24, 2025

రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తా: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు.  సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పస్తాపూర్ బహిరంగ సభలో సిఎం పాల్గొన్నారు. సభలో మంత్రులు కొండా సురేఖ, దామోదర, ఎంపి సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. జిల్లా మహిళా సంఘాలు తయారు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందని, గత సిఎం కేంద్రం మీద అలిగి ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.

చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం.. మనకే కదా? అని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని చెప్పారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని.. సలహాలు ఇవ్వాలని సూచించారు. ప్రతిపక్ష నేత 40 ఏళ్ల అనుభవం ఉపయోగించి సలహాలు ఇవ్వాలని కోరారు. సిఎం పదవి దక్కలేదని అసెంబ్లీకి రాకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుంటే.. ప్రజలే చూసుకుంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News