Saturday, May 24, 2025

ఎఫ్‌సిఐ తెలంగాణ రాష్ట్ర కాన్సులేటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా డికె అరుణ

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) తెలంగాణ రాష్ట్ర కాన్సులేటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆమెను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ద్వారా రాష్ట్రంలో ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సమర్థవంతంగా అమలు చేయడంలో డీకే అరుణ కీలక పాత్ర పోషిస్తారు. ఈ కమిటీ రైతులు, వినియోగదారుల హితాలను కాపాడటంతో పాటు తనీఖీలు నిర్వహిస్తూ, ఆహార ధాన్యాల నాణ్యత, నిల్వ సామర్థ్యం, రవాణా వంటి అంశాలపై సలహాలు ఇస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

కాగా తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. ‘రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడం నా లక్ష్యం. ఈ బాధ్యత ద్వారా తెలంగాణలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా’నని ఆమె పేర్కొన్నారు. కాగా డీకే అరుణ స్వస్థలమైన గద్వాల పట్టణంలో ఈ నియామకం సందర్భంగా ఆమె అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. డీకే అరుణ నాయకత్వంలో తెలంగాణలో ఆహార ధాన్యాల నిర్వహణ, సమర్థవంతంగా ఉంటుందని విశ్వసిస్తున్నామని వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News