Saturday, May 24, 2025

ఇడి ఛార్జిషీట్‌పై కాంగ్రెస్ జవాబు చెప్పాలి

- Advertisement -
- Advertisement -

ఛార్జిషీట్ సాక్షిగా అవినీతి
బట్టబయలైంది ఎన్‌డిఎ
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో
లేదో మిలియన్ డాలర్ల ప్రశ్నే
కేంద్ర దర్యాప్తు సంస్థే
చట్టపరమైన ఆధారాలతో
ఆరోపిస్తోంది సిఎం
కాకముందే కాంగ్రెస్ పెద్దలకు
వందల కోట్లు అప్పజెప్పారు
బిఆర్‌ఎస్ అగ్రనేత కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఇడి చార్జిషీట్‌లో నమోదవడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు తీవ్రంగా స్పందించారు. ఎన్ని నాటకా లు ఆడినా రేవంత్ రెడ్డి అవినీతి ఇడి చార్జిషీట్ సాక్షిగా బట్టబయలు అయిందన్నారు. నాలుగు కోట్ల ప్రజల ముందు రేవంత్ రెడ్డి అవినీతి బాగోతం బయటకు వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజలను వంచిందని, ప్ర జల నమ్మకాన్ని కోల్పోయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పేరు ఇది చార్జిషీట్లో రావడం తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమని, ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, పేదల జీవితాలతో చెలగాటం ఆడిన ముఖ్యమంత్రి పాపం పండిందని, ఎన్ని అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడిన చివరికి ధర్మమే గెలుస్తుందనీ కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

బ్యాగ్‌మ్యాన్ నుండి సిఎం వరకు అంతులేని అవినీతి ట్రాక్ రికార్డ్
ఒకప్పుడు రూ.50 లక్షల నగదు బ్యాగ్‌తో ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయబోయిన వ్యక్తే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని, అప్పటి ‘బ్యాగ్‌మ్యాన్’ రేవంత్ ఇప్పుడు కూడా అదే అవినీతి తీరు కొనసాగిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. ఇడి చార్జిషీట్ ప్రకారం, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యంగ్ ఇండియా సంస్థకు విరాళాల కోసం వ్యాపారవేత్తలకు పదవుల ప్రలోభాలు చూపారని, పార్టీ నేతలకు లంచాలు ఇచ్చారని పేర్కొందని తెలిపారు. ఇవి తాము చెప్పేది కాదు అని, కేంద్ర దర్యాప్తు సంస్థే చట్టపరమైన ఆధారాలతో ఆరోపిస్తోందని స్పష్టం చేశారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ పిసిసి పదవి కొనేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేశారని అన్నారని గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ స్పందించలేదని, ఇప్పుడు ఇడి నేరుగా చార్జిషీట్ దాఖలు చేయడంతో మీ బాధ్యత ఏంటి..? అంటూ కెటిఆర్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఈ మొత్తం అవినీతి వ్యవహారంపైన రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇడి చార్జిషీట్‌లో తన పేరు రావడంతో రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మరల్చేందుకు మరొక్కసారి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ప్రారంభించారని విమర్శించారు.

ఏడాదిన్నరలో సిఎం అవినీతి వేల కోట్లకు చేరింది
వందల కోట్లు నుంచి వేల కోట్ల దాకా వ్యాపించిన అవినీతి రేవంత్ సామ్రాజ్యం ద్వారా ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పెద్దల చేతిలో పదవి కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాడని కెటిఆర్ ఆరోపించారు. సిఎంగా ఉన్న గత ఏడాదిన్నరలో ఆయన అవినీతి వేల కోట్లకు చేరిందని అన్నారు. ఇడి చార్జిషీట్‌లో పేర్కొన్నవే కాక, తాము లేవనెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు కూడా వెలుగులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాము లేవనెత్తిన సివిల్ సప్లై స్కాం, అమృత్ స్కాం, ఆర్‌ఆర్ టాక్స్ వంటి ఆరోపణల పైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అన్నారు. ఎప్పటిలాగానే రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు బిజెపి పెద్దల కాళ్లపై పడగానే కేంద్రం చూసి చూడనట్టు వదిలేస్తుందా..? అన్న విషయం త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వ్యవహారం పైన విచారణ

చేస్తుందా..? లేదా…వాళ్లను కాపాడుతున్నదా..? అన్నది చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా పాలన కాస్త పర్సెంటేజీల పాలనగా మారిందని మంత్రి కొండా సురేఖ స్వయంగా అన్నారని, ఆమె కమిషన్ లేనిదే ఒక్క ఫైలు కూడా కదలడం లేదన్న వాస్తవాన్ని చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అనిరుద్ రెడ్డి 30 శాతం ఇవ్వకుంటే ప్రభుత్వంలో పనులు జరగడం లేదని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వం పైన కాలేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి ఆరోపణలు చేస్తుంటే ఆయనకు పిల్లనిచ్చిన మామ పద్మా రెడ్డి స్వయంగా కాళేశ్వరంలో అవినీతి లేదని చెప్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, తమ అవినీతి, కమిషన్ల గురించి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి రోజుకు ఒక నాటకం చేస్తున్నారని కెటిఆర్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News