Saturday, May 24, 2025

కడపలో మూడేళ్ల బాలికపై అత్యాచారం… చంపేసి ముళ్ల పొదల్లో పడేశాడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: రోజు రోజుకు కామాంధులు పెరిగిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా పసికందులపై అత్యాచారం చేస్తున్నారు. మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో జరిగింది. తల్లిదండ్రులతో పాటు పెళ్లికి వెళ్లిన మూడేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపేసి ముళ్ళ పొదల్లో పడేశాడు. నిందితుడిని ఉరి తీయాలని బంధువులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పబ్లిక్ లో నిందితుడిని ఉరి తీయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News