బెంగళూరు: నవ దంపతులు మధ్య గొడవలు జరగడంతో పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిని భర్త కత్తితో పొడిచం చంపని సంగటన కర్నాటక రాష్ట్రం మంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముస్తాఫా అనే వ్యక్తి(30) ఎనిమిది నెలల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. సులేమాన్ అనే వ్యక్తి(50) మధ్యవర్తిగా ఉండి ముస్తాఫాకు పెళ్లి చేశాడు. వివాహం జరిగినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో సులేమాన్‌ను ముస్తాఫా కలిశాడు. గయ్యాలి గంపతో తనకు ఇచ్చి పెళ్లి చేశావని సులేమాన్‌ను భర్త ప్రశ్నించాడు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో సులేమాన్ మెడపై ముస్తాఫా కత్తితో పొడిచాడు. అడ్డువచ్చిన సులేమాన్ కుమారులు రియాబ్, సియాబ్‌లపై కూడా ముస్తాఫా కత్తితో దాడి చేశాడు. అనంతరం అతడు పారిపోయాడు. స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సులేమాన్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.