Saturday, May 24, 2025

వరకట్నం కోసం దాడి చేసిన భర్త…. మర్మాంగాలను కొరికిన భార్య… యాసిడ్ తాగి

- Advertisement -
- Advertisement -

లక్నో: కట్నం తీసుకరావాలని భార్యను భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో భర్త మర్మాంగాన్ని భార్య కొరికింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాంభాల్ జిల్లాలోని అశ్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత కొన్ని సంవత్సరాల నుంచి భార్యను వరకట్నం తీసుకరావాలని భర్త వేధిస్తున్నాడు.

వరకట్నం విషయంలో దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో భర్త మర్మంగాలను భార్య కొరికింది. భర్త తీవ్రంగా గాయపడడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వెంటనే భార్య ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి ఆపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఆమెను కూడా మోరాదాబాద్ ఆస్పత్రికి తరలించారు. దంపతుల ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇరువైపుల నుంచి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీస్ అధికారి రాజీవ్ మాలిక్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News