Saturday, May 24, 2025

కడపలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో సికె దిన్నె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్ సమీపంలో లారీ, కారు ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. కారులో రాయచోటి నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కడప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News