Sunday, May 25, 2025

రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు, మూటల మనిషి : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీ అధినేతకు సూచనలు చేయాలనుకుంటే లేఖలు రాయవచ్చునని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. పార్టీ అధినేతకు లేఖలు రాస్తే తప్పేమి కాదని అన్నారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ కవిత లేఖపై కెటిఆర్ స్పందించారు. అంతర్గతంగా మాట్లాడే అంశాలు బయట మాట్లాడటం సరికాదని, పార్టీలో (party)అందరం కార్యకర్తలమే..ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, కోవర్టులు సమయం వచ్చినప్పుడు వారే బయటపడతారని పేర్కొన్నారు. అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉంటారని, తమ పార్టీలోనూ సిఎం రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండొచ్చునని అన్నారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అని దెయ్యం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. హైకమాండ్ కు డబ్బులిస్తూ రేవంత్ పదవి కాపాడుకుంటున్నారని, ఇడి ఛార్జ్ షీట్ లో పేరున్న రేవంత్ రాజీనామా చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

నాడు ఓటుకు నోటు స్కామ్..ఇది సీటుకు రూటు స్కామ్ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. నైతికత ఉంటే ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా తప్పుకోవాలని, ఆయన తప్పుకోకుంటే అధిష్టానం తొలగించాలని సూచించారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదని, మూటల మనిషి అని చురకలంటించారు. రేవంత్ దిల్లీ వెళ్లి చీకట్లో బిజెపి నేతల కాళ్లు పట్టుకుంటున్నారని, అమిత్ షాను రాత్రి కలిసిన రేవంత్ బయటికొచ్చిగట్టిగా మాట్లాడారని మండిపడ్డారు. నిందలు, దందాలు, చందాలు ఇదే రేవంత్ పని అని విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ పై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, దిల్లీకి చందాలు అని కెటిఆర్ దుయ్యబట్టారు. బిజెపి ఎంపిల భూదందాలకు సిఎం వత్తాసు పలుకుతున్నారని, బిజెపి నేతలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎందుకు కాపాడుతున్నారు? అని ప్రశ్నించారు. అందుకే నేషనల్ హెరాల్డ్ కేసుపై నేతలు మాట్లాడట్లేదని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని అంశాలపై కేంద్రం చర్య తీసుకోవాలని కెటిఆర్ కోరారు. కేంద్రం స్పందన కోసం నెల రోజులు ఎదురు చూస్తామని, నెల తర్వాత పార్టీలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం అని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News