Saturday, May 24, 2025

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ విలన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబై: పలు చిత్రాల్లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు ముకుల్ దేవ్ (54) (Mukul Dev) కన్నుమూశారు. ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్ దేవ్. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలియజేశారు.

సీరియల్ నటుడిగా కెరీర్ ఆరంభించిన ముకుల్ (Mukul Dev) పలు హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దస్తక్’ అనే సినిమాతో ముకుల్ వెండితెరకు పరిచయమయ్యారు. బాలీవుడ్‌లోనే కాకుండా.. తెలుగు, పంజాబీ, కన్నడ సినిమాల్లో నటించారు. రవితేజ నటించిన ‘కృష్ణ’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘అదుర్స్’, ‘కేడి’, ‘మనీ మనీ మోర్ మనీ’, ‘నిప్పు’, ‘భాయ్’ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు. 2022లో విడులైన ‘అంత్ ది ఎండ్’లో ఆయన చివరిసారిగా నటించారు. ముకుల్ దేవ్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News