Sunday, May 25, 2025

ఎంబిబిఎస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఎంబిబిఎస్ విద్యార్థినిపై (MBBS Student ) ముగ్గురు సహచర విద్యార్థులు అత్యాచారం చేసిన సంఘటన మహారాష్ట్రంలోని సంగ్లి జిల్లాలో జరిగింది. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యువతి ఎంబిబిఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ముగ్గురు స్నేహితులు కలిసి ఆమెను సినిమాకు తీసుకెళ్తామని చెప్పి రాత్రి పది గంటల సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి తన రూమ్‌కు తీసుకెళ్లారు.

మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ను ఆమెకు ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఎంబిబిఎస్ విద్యార్థినిపై (MBBS Student ) ముగ్గురు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మూడో విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితులు పూణే, సోలాపూర్, సంగ్లికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News