- Advertisement -
యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. శనివారం యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మర్ హాలీడేస్ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో లక్ష్మీనరసింహా స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
- Advertisement -