Sunday, May 25, 2025

రాహుల్ గాంధీకి షాకిచ్చిన కోర్టు.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపి-ఎమ్మెల్యేల కోర్టు షాకిచ్చింది. ఆయనపై నమోదైన పరువు నష్టం కేసులో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న ఆయన కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి నాయకుడు ప్రతాప్ కటియార్ పరువు నష్టం పిటిషన్ వేశారు.

రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బిజెపి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని చేసిన వ్యాఖ్యలు బిజెపి సభ్యులకు పరువు నష్టం కలిగించేలా ఉందని కటియార్ జూలై 9, 2018న చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే, జార్ఖండ్ హైకోర్టు సూచన మేరకు, పరువు నష్టం కేసును ఫిబ్రవరి 2020లో రాంచీలోని ఎంపి-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. చివరికి ఈ కేసును చైబాసాలోని ఎంపి-ఎమ్మెల్యే కోర్టుకు తిరిగి పంపించారు. దీంతో పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న మేజిస్ట్రేట్.. రాహుల్ గాంధీకి సమన్లు ​​జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News