Sunday, May 25, 2025

ఢిల్లీలో భారీ వర్షం.. రహదారులు జలమయం

- Advertisement -
దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పలుచోట్ల రహదారులు చెరువులను తలపించాయి. వరద నీరు భారీగా రోడ్లపైకి చేరుకోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరదతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బలమైన తుఫాను, కుండపోత వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 100కి పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాను సమయంలో 25కి పైగా విమానాలను దారి మళ్లించారు. కాగా, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News