Monday, August 25, 2025

ఇవాళ ఎన్డీఏ ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మీటింగ్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ హోటల్‌లో ఆదివారం ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. 20 రాష్ట్రాల సిఎంలు, డిప్యూటీ సిఎంలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సామావేశంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పిఒజెకె)లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’, జాతీయ భద్రతా, కులగణన, సుపరిపాలన వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సుపరిపాలన, అనుసరించాల్సిన అత్యుత్తమ పద్ధతులపై సమాలోచనలు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై ప్రధాని మోడీ, రక్షణ బలగాలను అభినందిస్తూ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News