- Advertisement -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మధురై జిల్లాలోని కుంజంపట్టి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మధురై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరవింద్ తెలిపారు.
- Advertisement -