ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టును ప్లేఆఫ్స్‌కి తీసుకువెళ్లాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (Shreyas Iyer). గత ఏడాది కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న అతను ఆ జట్టును విజేతగా నిలిపాడు. ఈసారి పంజాబ్‌ని ఫ్లేఆఫ్స్ వరకూ తీసుకువెళ్లండతో అందరూ అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 206 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేధించింది.
ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక సార్లు 200+ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోలేక ఓటమిపాలైన కెప్టెన్‌గా శ్రేయస్ అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. శ్రేయస్ ఇప్పటి వరకూ నాలుగు సార్లు 200+ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాడు. కోల్‌కతా కెప్టెన్‌గా రెండు సార్లు, పంజాబ్ కెప్టెన్‌గా రెండు సార్లు ఈ భారీ టార్గెట్‌ని ఢిఫెండ్ చేసుకోలేకపోయాడు. శ్రేయస్ తర్వాత ఈ చెత్త రికార్డులో ఎంఎస్ ధోనీ, డుప్లెసిస్, శుభ్‌మాన్ గిల్ ఉన్నారు. వీరు ముగ్గురు మూడు సార్లు 200+ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు.
అంతేకాక.. పంజాబ్ జట్టు ఖాతాలో కూడా చెత్త రికార్డు చేసింది. అత్యధిక సార్లు 200+ లక్ష్యాన్ని కాపాడుకోలేని జట్టుగా పంజాబ్ నిలిచింది. ఏడుసార్లు 200+ లక్ష్యాన్ని పంజాబ్ కాపాడుకోవడంలో విఫలం కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్‌సిబి(6), సిఎస్‌కె(5) ఉన్నాయి. కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఢిల్లీ 19.3 ఓవర్లలో 208 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.