Sunday, May 25, 2025

జపాన్‌ను దాటేశాం.. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: నీతి ఆయోగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం చెప్పారు.దేశ నామమాత్రపు జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపారు. 2024 వరకు భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. ‘వీక్షిత్ రాజ్య ఫర్ వీక్షిత్ భారత్ 2047’ అనే అంశంపై శనివారం ఢిల్లీలో 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీవీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డేటా ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకున్నట్లు చెప్పారు.

“నేను చెప్పినట్లుగా మనం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. మనది 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. ఇది నా డేటా కాదు.. IMF డేటా. నేడు భారత్, జపాన్ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ మాత్రమే మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి. మనం వేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉంటే.. మరో 2, 2.5 నుండి 3 సంవత్సరాలలోనే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం” అని సుబ్రహ్మణ్యం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News