Sunday, May 25, 2025

మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై స్పందించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మొదటిసారిగా జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల నుంచి వైదొలగుతున్నట్లు మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ (Milla Magee)  ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఈ పోటీల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేశారు. నిర్వహకులు పోటీదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని. తాను వేశ్యననే భావనను కలిగేలా పరిస్థితులు నిర్వాహకులు ప్రవర్తించారని బాంబు పేల్చారు. దీంతో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలపై కెటిఆర్ (KTR) స్పందించారు.

మిల్లా మాగీ (Milla Magee) చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఎక్స్ వేదికగా కెటిఆర్ (KTR) డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో మహిళలను గౌరవిస్తామని.. వారి అభివృద్ధికి సమాన హక్కులు కల్పిస్తామని తెలిపారు. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి మహిళలు పుట్టిన నేల ఇది అని ఆయన అన్నారు. మహిళలకు అవమానం జరగడాన్ని తెలంగాణ అంగీకరించదు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇలాంటి అనుభవాలు జరగకూడదని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News