Sunday, May 25, 2025

అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన కోహ్లీ, అనుష్క

- Advertisement -
- Advertisement -

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఆదివారం రామమందిరంతోపాటు హనుమాన్ గర్హి ఆలయాన్ని కూడా సందర్శించారు. హనుమాన్ గర్హి ఆలయంలో కోహ్లీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రార్థనలు చేస్తున్న జంట యొక్క అనేక చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆలయ సందర్శనపై సంజయ్ దాస్ జీ మహారాజ్, మహంత్ హనుమాన్ గర్హి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఆధ్యాత్మికత, సంస్కృతి, దేవుడు, సనాతన ధర్మం పట్ల లోతైన ప్రేమ ఉంది. వారు రాముడి లల్లాను సందర్శించి, హనుమంతుడి నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికత, పౌరాణిక విషయాల గురించి వివరాలు తెలుసుకున్నారు” అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల కోహ్లీ దంపతులు బృందావనాన్ని సందర్శించి.. ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News