Sunday, May 25, 2025

ఆర్జేడీ పార్టీ నుంచి తేజ్ ప్రతాప్ బహిష్కరణ

- Advertisement -
- Advertisement -

నైతిక విలువలు పాటించనందుకు వేటు వేసినలాలూ ప్రసాద్ యాదవ్

పాట్నా: ఆర్జేడీ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ అధినేత లాలు ప్రసాద్ పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. నైతిక విలువలు విస్మరించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు లాలూ ప్రసాద్ వివరించారు. తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత సంబంధాలపై పోస్ట్ పెట్టి, తర్వాత తొలగించినా, ఆ పోస్ట్ పై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఐశ్వర్య తో చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉంటే , 2018లో తేజ్ ప్రతాప్ ఎందుకు పెళ్లి చేసుకున్నారని చాలా మంది నిలదీశారు.

దీంతో తేజ్ ప్రతాప్ నైతిక విలువలను విస్మరించడం సామాజిక న్యాయంకోసం ఆర్జేడీ సాగిస్తున్న పోరాటాన్ని బలహీనపరుస్తుందని
లాలూ అన్నారు.తేజ్ ప్రతాప్ కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహితమైన ప్రవర్తన తమ కుటుంబ విలువలకు అనుగుణంగా లేవని, ఈ పరిస్థితిలో అతడిని పార్టీ నుంచి, కుటుంబం నుంచి తొలగిస్తున్నానని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఇకనుంచి అతనికి పార్టీలోనూ, కుటుంబంలోనూ ఎలాంటి పాత్ర ఉండదన్నారు. ఆరేళ్లపాటు పార్టీ నుంచి వేటు వేశారు.

తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టి తొలగించాడు. ఆ పోస్ట్ లో తన ప్రొపైల్ లో ఒక అమ్మాయి ఫోటో ఫోటో పెట్టి ఆమె అనుష్క యాదవ్ అనీ, ఆమెతో 12 ఏళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పారు. 2018లో తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత వారిద్దరూ విడిపోయారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలతో సహా పలువురు తేజ్ ప్రతాప్ దుమ్మెత్తి పోస్తూ, ఎవరితోనో రిలేషన్ షిప్ పెట్టుకుని , ఐశ్వర్యను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు విడిచి పెట్టాడు.. నైతిక బాధ్యతలేదా అని విమర్శించారు. తేజ్ ప్రతాప్ తన చర్యలతో కుటుంబం పరువు, పార్టీ పరువు తీస్తున్నాడన్న ఆగ్రహంతో లాలూ ప్రసాద్ తడిపై చర్య తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News