- Advertisement -
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్ దశలో ఇది రెండు జట్లని చివరి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. కోల్‌కతా (KKR) ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలోకి వెళ్తుంది. ఒకవేళ సన్‌రైజర్స్ (SRH) గెలిస్తే.. కోల్‌కతాని, లక్నోని వెనక్కి నెట్టి 6వ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్, కోల్‌కతా జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
- Advertisement -