Thursday, August 28, 2025

పట్టపగలే అకాలీదళ్ కౌన్సిలర్ ను కాల్చి చంపారు..

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గుర్తు తెలియని దుండగులు శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ హర్జిందర్ సింగ్ బహ్మాన్‌ను పట్టపగలు కాల్చి చంపారు. ఛెహర్తా ప్రాంతంలోని గురుద్వారా సమీపంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన సింగ్ పై కాల్పులు జరిపారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. వేదిక నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు కౌన్సిలర్‌పై మెరుపుదాడి చేశారు. ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన సింగ్.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ ఘటనపై స్పందించిన అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్పాల్ సింగ్ రాంధావా.. “హర్జిందర్‌ను బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించాడు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News