Thursday, May 29, 2025

కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాక్..

- Advertisement -
- Advertisement -

కొమురంభీం: కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాకిచ్చాడు. కాంగ్రెస్‌ పార్టీతో కోనప్ప తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌కు దూరంగానే ఉన్నానని.. దూరంగానే ఉంటానని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ… ఏ పార్టీ లోకైనా వెళ్తా కానీ.. కాంగ్రెస్‌లోకి మాత్రం పోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరానని.. కానీ, కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేవుడు అని ఇదివరకే తాను చెప్పానని, ఆయనకు పాదాభివందనాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే చెప్పానని కోనప్ప అన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బిఆర్ఎస్ నుంచి బయటికి వచ్చానని.. రాజకీయంగా బిఆర్ఎస్, కెసిఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. తాను మళ్లీ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లను కోనప్ప చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News