Thursday, May 29, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌ రావు పిటిషన్ ను తిరస్కరించిన అమెరికా

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావుకు అమెరికాలో చుక్కెదురైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారైన ప్రభాకర్‌ రావు అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో అతన్ని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర సహకారం తీసుకున్న రాష్ట్ర పోలీసులు.. ప్రభాకర్ రావును రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు అమెరికా కోర్టును ఆశ్రయించాడు. రాజకీయ కక్షలో భాగంగా తనపై కేసులు పెట్టారని.. కాబట్టి, తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే జూన్‌ 20లోగా కోర్టులో హాజరు కావాలంటూ ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News